సెల్ఫ్ వెరిఫికేషన్ సేవను ప్రారంభించిన 'కూ'
Use Govt ID to get green tick verification on Koo app. భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫాం 'కూ' తన వినియోగదారుల కోసం
By Medi Samrat
భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫాం 'కూ' తన వినియోగదారుల కోసం సరికొత్త స్వీయ-ధృవీకరణ(self-verification) సేవను ప్రారంభించింది. తద్వరా 'కూ' స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన మొదటి సోషల్ మీడియా యాప్ గా అవతరించింది. వినియోగదారులు ప్రభుత్వం ఆమోదించిన ID కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ప్లాట్‌ఫారమ్‌లో వారి ప్రొఫైల్‌ను సెకన్లలో స్వీయ-ధృవీకరణ చేసుకోవచ్చని 'కూ' ఒక ప్రకటనలో తెలిపింది. దీనిద్వారా ప్రజలు పంచుకునే ఆలోచనలు, అభిప్రాయాలకు ప్రామాణికతను, విశ్వసనీయతను అందిస్తుందని తెలిపింది. ఖాతా ధృవీకరించబడినట్లు గుర్తించడానికి ప్రొఫైల్ పక్కన 'కూ' గ్రీన్ టిక్ రూపంలో ఓ మార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఫీచర్ రూల్ 4(7) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కి అనుగుణంగా ప్రవేశపెట్టబడిందని ట్విటర్ ప్రత్యర్థి అయిన 'కూ' యాప్ పేర్కొంది.
మీ Koo ఖాతాను స్వీయ-ధృవీకరణ(self-verification) చేయడం ఎలా?
- వినియోగదారులు ముందుగా తమ ప్రభుత్వ-ID నంబర్‌ను నమోదు చేయాలి.
- వినియోగదారు IDతో జతచేయబడిన ఫోన్ నంబర్‌పై OTPని పొందుతారు.
- OTP విజయవంతంగా జతపరిచిన తర్వాత, వినియోగదారు ప్రొఫైల్‌లో గ్రీన్ టిక్‌తో స్వీయ-ధృవీకరణ(self-verification) పొందుతారు.
- 'కూ' ధ్రువీకరణ ప్రక్రియ ప్రభుత్వ-ఆధీనంలో థర్డ్ పార్టీ ద్వారా నిర్వహించబడతాయి.
- ఈ ప్రక్రియలో 'కూ' ఎలాంటి సమాచారాన్ని నిల్వ చేయదని యాప్ ప్రకటించింది.
ఈ విషయమై 'కూ' సహ వ్యవస్థాపకుడు & CEO అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "సోషల్ మీడియాలో విశ్వాసం, భద్రతను ప్రోత్సహించడంలో 'కూ' ముందంజలో ఉంది. ప్రపంచంలో స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణ వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయినందుకు మేము చాలా గర్విస్తున్నాము. మా సురక్షితమైన ధృవీకరణ ప్రక్రియ ద్వారా వినియోగదారులు 30 సెకన్లలోపు స్వీయ-ధృవీకరణను పొందవచ్చు. వినియోగదారులకు మరింత ప్రామాణికతను అందించడానికి, ప్లాట్‌ఫారమ్‌లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి ఇది ఒక భారీ అడుగు. చాలా సామాజిక మాధ్యమాలు కొన్ని ఖాతాలకు మాత్రమే ఈ శక్తిని ఇస్తాయి. Koo ఇప్పుడు ప్రతి వినియోగదారుకు ఒకే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉండేలా అధికారం కల్పించిన మొదటి ప్లాట్‌ఫారమ్ అని అన్నారు.