యూపీఐ సేవలు డౌన్.. ఎస్‌బీఐ చెబుతోంది ఇదే..!

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

By -  Medi Samrat
Published on : 1 April 2026 4:02 PM IST

యూపీఐ సేవలు డౌన్.. ఎస్‌బీఐ చెబుతోంది ఇదే..!

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీఐ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన అనేకమంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరి లావాదేవీలు మధ్యలోనే ఆగిపోగా, మరికొందరి యూపీఐ యాప్‌లు పూర్తిగా లోడ్ అవ్వలేదు. ఔటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచే 500కు పైగా ఔటేజ్ రిపోర్టులు వచ్చాయి. యూకో బ్యాంకుకు సంబంధించి దాదాపు 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ అంతరాయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. షెడ్యూల్ ప్రకారం చేపట్టిన నిర్వహణ పనుల సమయాన్ని ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ సమయంలో యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవల్లో అంతరాయం కలగవచ్చని పేర్కొంది.

Next Story