ఏటీఎంకు వెళ్తే షాక్, అకౌంట్‌లో రూ.10 కోట్లు..ఆ మహిళ ఏం చేసిందంటే?

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన సీత అనే మహిళ తన బ్యాంక్ ఖాతాలో అకస్మాత్తుగా దాదాపు 10 కోట్ల రూపాయలు (రూ. 9,99,49,586) జమ కావడంతో షాక్‌కు గురైంది

By -  Knakam Karthik
Published on : 29 March 2026 4:40 PM IST

Viral News, Uttarpradesh, UP Woman, Banking Error, Bank Of India

ఏటీఎంకు వెళ్తే షాక్, అకౌంట్‌లో రూ.10 కోట్లు..ఆ మహిళ ఏం చేసిందంటే?

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన సీత అనే మహిళ తన బ్యాంక్ ఖాతాలో అకస్మాత్తుగా దాదాపు 10 కోట్ల రూపాయలు (రూ. 9,99,49,586) జమ కావడంతో షాక్‌కు గురైంది. ఆమె కుమారుడు ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు ఈ భారీ మొత్తం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆ కుటుంబం, ఆ డబ్బు తమది కాదని, వెంటనే దానిని వెనక్కి తీసుకోవాలని అధికారులను కోరింది.

దీనికి సంబంధించిన ఏటీఎం రసీదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్యాంక్ అధికారులు స్పందించారు. సుల్తాన్‌గంజ్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ ఇది కేవలం 'సాంకేతిక లోపం' (Technical Error) వల్ల జరిగిన పొరపాటని వివరించారు. ఆ మహిళకు గతంలో లోన్ అకౌంట్ ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, త్వరలోనే ఈ లోపాన్ని సరిదిద్దుతామని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. తమది కాని సొమ్ము తమకు వద్దంటూ ఆ కుటుంబం చూపిన నిజాయితీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story