భర్తను క‌ట్టేసి సిగరెట్‌తో శరీర భాగాలను కాల్చిన మ‌హిళ

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక మహిళ తన భర్తను చిత్రహింసలకు గురిచేసి.. అతనిని కట్టేసి సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చినందుకు అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  7 May 2024 10:30 AM IST
భర్తను క‌ట్టేసి సిగరెట్‌తో శరీర భాగాలను కాల్చిన మ‌హిళ

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక మహిళ తన భర్తను చిత్రహింసలకు గురిచేసి.. అతనిని కట్టేసి సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చినందుకు అరెస్టు చేశారు. మెహర్ జహాన్ అనే మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు మే 5న సియోహరా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భర్త మనన్ జైదీ కాళ్లూ చేతులు కట్టేసిన భార్య సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చేసింది. మెహర్ జహాన్ అతనిపై దాడి చేయడం, చేతులు, కాళ్ళు కట్టివేసి, అతని ఛాతీపై కూర్చొని ఊపిరి ఆడకుండా చేసి చంపడానికి ప్రయత్నించినట్లు చూపుతున్న CCTV ఫుటేజీని భర్త పోలీసులకు అందించాడు. వీడియోలో, ఆమె సిగరెట్‌తో తన భర్త శరీర భాగాలను కాల్చడం చూడవచ్చు.

గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన భార్య తనను మత్తుమందు ఇచ్చి హింసించిందని భర్త ఆరోపించాడు. హత్యాయత్నం, దాడి, చిత్రహింసలతోపాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద మెహర్ జహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా నిందితురాలిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద రిపోర్టు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ ధరంపాల్ సింగ్ తెలిపారు.

Next Story