ఉన్నావ్‌లో ఘోరం : కరోనా కర్ఫ్యూను ఉల్లంఘించాడంటూ మైన‌ర్‌పై రెచ్చిపోయిన‌ పోలీసులు

UP Teen Allegedly Thrashed For Violating Curfew. ఉత్తరప్రదేశ్‌లో బాలుడి పై విచక్షణా రహితంగా దాడి చేసిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు

By Medi Samrat  Published on  22 May 2021 9:46 AM GMT
ఉన్నావ్‌లో ఘోరం : కరోనా కర్ఫ్యూను ఉల్లంఘించాడంటూ మైన‌ర్‌పై రెచ్చిపోయిన‌ పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో బాలుడి పై విచక్షణా రహితంగా దాడి చేసిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఉన్నావోలో ఫైసల్‌ అనే 17 ఏళ్ల మైనర్ బాలుడు కరోనా కర్ఫ్యూను ఉల్లంఘించాడంటూ పోలీసులు చెయ్యి చేసుకున్నారు. శుక్రవారం నాడు బాలుడు మృతి చెందడంతో తొలుత ఒక హోం గార్డ్‌ను సస్పెండ్‌ చేసిన అధికారులు ఇప్పుడు మొత్తం ముగ్గురిని సర్వీసు నుండి తొలగించారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

లక్నోకు 65 కిలోమీటర్ల దూరంలో ని ఓ పట్టణానికి చెందిన ఫైసల్ సమీపంలోని మార్కెట్‌లో కూరగాయాలు అమ్ముతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. శుక్రవారం కూడా యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. కరోనా ఉదృతి నేపథ్యంలో యుపిలో కూడా అమలులో ఉంది. అయితే బాలుడు కర్ఫ్యూ నిబంధనలు పాటించ లేదంటూ పోలీసులు వానిపై పలు మార్లు చేయిచేసుకున్నారని, అనంతంరం ఫైసల్‌ తో పాటూ కొంతమందితో ని ను పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లి.. ఇష్టానుసారంగా కొట్టారని తోటి వ్యాపారులు చెబుతున్నారు.

తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లగా...మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకించారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసనలు చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని లక్నో రోడ్డును దిగ్బంధించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్స్‌తో పాటు హోం గార్డ్‌ను సస్పెండ్‌ చేశామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు.


Next Story