క‌రోనాతో మంత్రి విజ‌య్ క‌శ్య‌ప్ క‌న్నుమూత‌

UP Minister Vijay Kashyap passed away. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి విజ‌య్ క‌శ్య‌ప్ క‌రోనాతో క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 1:39 AM GMT
Vijay Kashyap

క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రికి ఈ మ‌హ‌మ్మారి సోకుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి విజ‌య్ క‌శ్య‌ప్ క‌రోనాతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 56 సంవ‌త్స‌రాలు. ఇటీవ‌ల ఆయ‌న క‌రోనా బారిన ప‌డ‌డంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న తుది శ్వాస విడిశారు. ఆయ‌న ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లోని ఛ‌ర్త‌వాల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. మంత్రి మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా సంతాపం తెలిపారు. మంచి కార్య‌క‌ర్త‌ను పార్టీ కోల్ప‌యింద‌ని చెప్పారు కాగా.. సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ మంత్రివర్గంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. క‌శ్య‌ప్ మృతితో ఆ సంఖ్య‌గా మూడుకు చేరింది.

ఇదిలాఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మృతిచెందారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ కొరి ఈ నెల 7న కొవిడ్‌తో తుదిశ్వాస విడువ‌గా.. అంత‌కుముందు నవాబ్ జంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గంగ్వార్, ఏప్రిల్ 23న‌ లక్నో పశ్చిమ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ శ్రీ వాస్తవ, ఏప్రిల్ 22న అరారియా ఎమ్మెల్యే రమేశ్ చంద్ర దివాకర్ కూడా క‌రోనాతోనే క‌న్నుమూశారు.
Next Story
Share it