ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ వ్యక్తి కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులను ప్రశ్నించగా.. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా తన ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి ప్రవేశించిందని తెలిపారు. ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి మహేంద్ర కాగా.. హర్దోయ్ జిల్లా అతని స్వస్థలం. అర్ధరాత్రి హర్దోయ్ మెడికల్ కాలేజీ అత్యవసర విభాగానికి చేరుకున్నాడు. మహేంద్ర వింత సమస్య డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది దృష్టిని త్వరగా ఆకర్షించింది. దీంతో అతడిని క్షుణ్ణంగా పరిశీలించినా.. అతని శరీరంలో పాము కాటుకు సంబంధించిన ఆధారాలు లేదా వేరే ఏ వస్తువు కనిపించలేదు. వైద్య సిబ్బంది హామీ ఇచ్చినప్పటికీ.. రెండో అభిప్రాయం కోసం మహేంద్రను మరో ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు.
అతన్ని పరీక్షించిన వైద్యులు.. అతను డ్రగ్స్ మత్తులో ఈ చర్యకు పాల్పడ్డాడని.. మరుసటి రోజు ఉదయం అతన్ని డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. డాక్టర్ షేర్ సింగ్ ప్రకారం.. “ఆ వ్యక్తి మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నట్లు కనిపించాడు. అప్పుడప్పుడు కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. ఇది డ్రగ్స్ వాడకం వల్ల జరుగుతుంది. ఆ వ్యక్తి తన ఆందోళనను కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు, వారు ఆందోళన చెందారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఉదయం యువకుడికి సీటీ స్కాన్ జరిగింది. అందులో ఎటువంటి సమస్య లేనట్లు వెల్లడయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని మరో పరీక్ష కోసం తీసుకెళ్లమని తెలిపారు. అనంతరం అతన్ని డిశ్చార్జ్ చేశామని తెలిపారు.