ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ డిసెంబర్ 22న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. క్రిస్మస్‌కు ప్రభుత్వ సెలవు దినం జారీ చేయడానికి బదులుగా భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయిని గౌరవించే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని పాఠశాలలను ఆదేశించారు. విద్యార్థులందరూ హాజరు తప్పనిసరి చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు తెరిచి ఉంటాయి.
ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆ రోజున విద్యార్థులకు భారతీయ విలువలను బోధించాలని, వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన కవితా పఠనాలు, వ్యాసరచన పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్య, వాజ్‌పేయిల జయంతిని డిసెంబర్ 25న యేసుక్రీస్తు జయంతిగా కాకుండా జరుపుకోవాలని సూచించారు.