ఉత్తరప్రదేశ్ సీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్‌ హ్యాక్

UP CMO Twitter handle gets hacked.ఇటీవ‌ల కాలంలో హ్యాక‌ర్లు రెచ్చిపోతున్నారు. సెల‌బ్రెటీలే ల‌క్ష్యంగా వారి ఖాతాల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2022 10:18 AM IST
ఉత్తరప్రదేశ్ సీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్‌ హ్యాక్

ఇటీవ‌ల కాలంలో హ్యాక‌ర్లు రెచ్చిపోతున్నారు. సెల‌బ్రెటీలే ల‌క్ష్యంగా వారి ఖాతాల‌ను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం కార్యాల‌య ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేశారు. అనంత‌రం అనేక పోస్టుల‌ను పోస్ట్ చేశారు. శుక్ర‌వారం రాత్రి హ్యాక‌ర్లు సీఎం కార్యాల‌య ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేసిన‌ట్లు శ‌నివారం సీఎం కార్యాల‌యం తెలియ‌జేసింది. దాదాపు 4 గంట‌ల త‌రువాత ఖాతాను పున‌రుద్ద‌రించిన‌ట్లు తెలియ‌జేశారు.

హ్యాక‌ర్లు సీఎంఓ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాను హ్యాక్ చేసిన అనంత‌రం సీఎం ఆదిత్యనాథ్ ఫొటోను తొల‌గించారు. వందలాది మంది ట్విట్ట‌ర్ వినియోగదారుల‌కు ట్యాగ్ చేస్తూ హ్యాకర్ అనేక ట్వీట్లను చేశారు. ఓ కార్టునిస్టు చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్ గా ఉపయోగించారు. Tutorial : How to Turn on your BAYC/MAYC అనే ట్వీట్ ను పిన్ చేశారు.

ఖాతా హ్యాక్ అయిన‌ట్లు గుర్తించిన అధికారులు వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఖాతాను తిరిగి పునరుద్ద‌రించారు. హ్యాక‌ర్లు పెట్టిన అన్నీ ట్వీట్ల‌ను తొల‌గించారు. కాగా.. హ్యాక్ అయిన సీఎంఓ అకౌంట్ స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం యూపీ సీఎంఓ (@CMOfficeUP) ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా కూడా హ్యాక్‌కి గురైన సంగ‌తి తెలిసిందే.

Next Story