నిత్యానంద ఇలా షాక్ ఇస్తాడని భారత్ అసలు ఊహించి ఉండదు..!

‘United States Of Kailasa' At UN Meet, Claims Nithyananda Is Being Persecuted. నిత్యానంద.. ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. భారత్ నుండి పారిపోయి బ్రతుకుతూ ఉన్నాడు.

By M.S.R  Published on  28 Feb 2023 6:45 PM IST
నిత్యానంద ఇలా షాక్ ఇస్తాడని భారత్ అసలు ఊహించి ఉండదు..!

నిత్యానంద.. ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. భారత్ నుండి పారిపోయి బ్రతుకుతూ ఉన్నాడు. ఏకంగా సొంత దేశం పెట్టానని.. అందరికీ ఆహ్వానమే అంటూ బిజినెస్ కూడా మొదలుపెట్టాడు. అలాంటి నిత్యానంద ఇప్పుడు భారతదేశంపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఐక్య రాజ్య సమితిలో మహిళా సాధికారతపై జరిగిన సమావేశంలో తన దేశం యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస ప్రతినిధి పాల్గొన్నారని నిత్యానంద పరమశివం ప్రకటించారు. నిర్ణయాలు చేసే వ్యవస్థల్లో మహిళలకు సమాన, సమ్మిళిత పాత్ర, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులు, సుస్థిర అభివృద్ధిపై సాధారణ వ్యాఖ్య అంశాలపై ఈ సమావేశం జరిగింది. నిత్యానంద చేసిన ట్వీట్లలో కైలాస అధిపతి సెయింట్ లూయీస్ మా సోనా కామత్, కైలాస ప్రతినిధులు జెనీవాలో ఫిజీ, కామెరూన్ దౌత్యవేత్తలు సమావేశమైనట్లు పేర్కొన్నారు. విజయప్రియ నిత్యానంద అనే మహిళ నిత్యానందను సమర్థించేందుకు యూఎన్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ నిర్వహించిన 19వ సమావేశానికి హాజరయ్యారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ స్థాపకుడు నిత్యానందను భారత్ వేధింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు. కైలాసాన్ని హిందూమత తొలి సార్వభౌమ రాజ్యమని అన్నారు. అంతేకాకుండా రెండు మిలియన్ల నిత్యానంద భక్తులను హింసించడాన్ని ఆపాలని పిలుపునిచ్చారు విజయప్రియ నిత్యానంద.

“కైలాసం హిందువులకు మొదటి సార్వభౌమ రాజ్యం, హిందూమతం యొక్క సర్వోన్నత వ్యక్తి అయిన నిత్యానంద పరమశివం స్థాపించారు, అతను హిందూ మతానికి సంబంధించిన 10,000 దేశీయ సంప్రదాయాలను తిరిగి తీసుకుని వచ్చారు, ఇందులో ఆది శైవ దేశీయ వ్యవసాయ తెగలు కూడా ఉన్నాయి.” అని విజయప్రియ అన్నారు. ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో విజయ ప్రియ పలు విషయాలను ప్రస్తావించారు.


Next Story