నిజ‌మే.. వివాహాలు స్వర్గంలో నిశ్చ‌యించ‌బ‌డ‌తాయ్‌..!

Unique couple backed by plenty of good wishes enter wedded life. భార్యాభర్తలుగా మారిన ఈ జంటను ఒక్కసారిగా చూస్తే ఇది బాల్య వివాహమే అనే భావన కలుగుతుంది.

By అంజి  Published on  30 Nov 2021 11:28 AM IST
నిజ‌మే.. వివాహాలు స్వర్గంలో నిశ్చ‌యించ‌బ‌డ‌తాయ్‌..!

భార్యాభర్తలుగా మారిన ఈ జంటను ఒక్కసారిగా చూస్తే ఇది బాల్య వివాహమే అనే భావన కలుగుతుంది. మూడు అడుగుల ఎత్తు గల వరుడు.. రెండు అడుగుల ఎత్తు గల వధువు.. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. చిక్క‌బ‌ళ్ల‌పూర్ జిల్లాలోని చింతామణి తాలూకాలోని కైవర ఆలయంలో ఆదివారం జరిగిన ఈ జంట వివాహం ప్రజలను ఆకర్షించింది. ఈ అందమైన జంట జ్యోతి, విష్ణుల వివాహం బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. వీరిద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. వివాహాలు స్వర్గంలో జరుగుతాయని చాలా మంది నమ్ముతారు. దానికి ఈ వివాహాం ఒక నిదర్శనంలా కనిపిస్తోంది.

ఈ జంట యుక్తవయస్కుల్లా కనిపించనప్పటికీ, వరుడికి 28 ఏళ్లు, వధువు 25 ఏళ్లు. విష్ణు బెంగళూరుకు చెందినవాడు కాగా జ్యోతి కోలార్‌కు చెందినది. ఇద్దరూ గ్రాడ్యుయేట్లు. మంచి ఎత్తు ఉన్నవారు మరుగుజ్జులను వివాహం చేసుకోవడం సౌకర్యంగా ఉండదు కాబట్టి మరుగుజ్జులకు తగిన జోడి దొరకడం కష్టం. జ్యోతి, విష్ణుల తల్లిదండ్రులు చాలా కాలంగా వివాహం కోసం సంబంధాలు చూశారు. కానీ వారి ప్రతిపాదనలు చాలా వరకు ఎత్తు కారణంగా తిరస్కరించబడ్డాయి. ఎలాగోలా ఈ రెండు కుటుంబాలు ఒకరి గురించి మరొకరు తెలుసుకుని పెళ్లికి అంగీకరించారు. ఇద్దరూ ఇప్పుడు కలిసి తమ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడం ప్రారంభించారు.

Next Story