షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి, ముంబయి జైల్లో ఉన్నాడు. జైలులోని తన గదిలో ఆర్యన్ ఖాన్ పుస్తకాలు చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ జైలు గదిలో రెండు పుస్తకాలు ఉండగా, వాటిలో ఒకటి ఫిక్షన్ నవల కాగా, రెండోది రామాయణ గ్రంథం! తనకు చదువుకోవడానికి పుస్తకాలు కావాలని ఆర్యన్ జైలు అధికారులను కోరగా, జైలులో ఉన్న గ్రంథాలయం నుంచి అధికారులు రెండు పుస్తకాలు తీసుకువచ్చి ఆర్యన్ కు అందించారు. ఇక భద్రతా కారణాల రీత్యా ఆర్యన్ ఖాన్ ను అధికారులు ఇతర సాధారణ ఖైదీలతో కలవనివ్వడంలేదని తెలుస్తోంది.
తాజాగా షారుఖ్ ఖాన్‌కు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే కీలక సూచన చేశారు. ఆర్యన్ ఖాన్‌ను పునరావాస కేంద్రానికి పంపాలని రాందాస్ అథవాలే సూచించారు.చిన్న వయసులో డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదని.. ఆర్యన్ ఖాన్‌కు భవిష్యత్తు ఉంది. ఆర్యన్ ఖాన్‌ను మినిస్ట్రీకి సంబంధించిన డి-అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కి పంపమని షారుఖ్ ఖాన్‌కు సలహా ఇస్తున్నానని అథవాలే తెలిపారు. అతను 1-2 నెలలు అక్కడ ఉండాలి.. అతడిని జైల్లో ఉంచకూడదని కూడా అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు చాలానే ఉన్నాయని.. ఒకటి రెండు నెలల్లో డ్రగ్స్ వ్యసనం నుంచి విముక్తి పొందుతాడని మంత్రి రాందాస్ తెలిపారు.