యోగా చేస్తూ అకస్మాత్తుగా వేదికపై పడిపోయిన కేంద్ర‌మంత్రి

Union Minister Pashupati Paras Taken Ill While Practicing Yoga In Bihar's Hajipur. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాస‌నాలు వేస్తున్న‌ సమయంలో కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్

By Medi Samrat
Published on : 21 Jun 2023 4:06 PM IST

యోగా చేస్తూ అకస్మాత్తుగా వేదికపై పడిపోయిన కేంద్ర‌మంత్రి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాస‌నాలు వేస్తున్న‌ సమయంలో కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కేంద్రమంత్రి వేదికపైనే పడిపోవడంతో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న ఓ అధికారి, ఆయన పీఏ పశుపతి కుమార్ పరాస్‌ను లేపి సోఫాలో కూర్చోబెట్టారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ బుధవారం ఉదయం హాజీపూర్‌లోని కొన్హారా సమీపంలో ఏర్పాటు చేసిన.. యోగా శిబిరానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్క‌డ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వేదికపై మంత్రితోపాటు మరికొందరు యోగా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అకస్మాత్తుగా పశుపతి పరాస్ ఆరోగ్యం క్షీణించింది. దీందో వేదికపైనే పడిపోయారు. అక్కడే ఉన్న అధికారి, ఆయ‌న పీఏ అతన్ని నిర్వహించి, అతనిని ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టారు.

పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ.. నా ఆరోగ్యం బాగాలేదు. గతంలో ముజఫర్‌పూర్‌కు వెళ్తుండగా వాహనం గొయ్యిలో బోల్తా పడడంతో శారీరక ఇబ్బంది ఏర్పడింది. శారీరక సమస్య కారణంగా యోగా చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటాన‌ని అన్నారు.


Next Story