బడ్జెట్ 2021-22 విశేషాలు : కరోనా ఎఫెక్ట్.. ఆరోగ్యానికి పెద్దపీఠ!

Union Budget 2021 Highlights. బడ్జెట్‌ 2021-22లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు.

By Medi Samrat  Published on  1 Feb 2021 7:59 AM GMT
Union Budget 2021 Highlights

దేశంలో కరోనా ఎంతగా ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆర్థికంగా ఎంతో మంది నానా ఇబ్బందులు పడ్డారు. కొన్ని రంగాలు చాలా వేగంగా ఆర్ధిక పురోగతి సాధించినా, కొన్ని రంగాలలో ఇప్పటికీ ఆర్ధిక ఇబ్బందులతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు సతమతమౌతున్నాయి.

ఈ నేపథ్యంలో నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ 2021 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సామాన్య ప్రజలు. మద్యం, పొగాకు ఉత్పత్తుల పై పన్నులు పెరిగే అవకాశం ఉందని... నైపుణ్యాభివృద్ధి లాంటి రంగాలలో మహిళలకు ప్రోత్సాహాలు, వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు పలు కీలక నిర్ణయాలు ఈ బడ్జెట్‌ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బడ్జెట్‌ 2021-22లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు.

కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపులు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. కొత్తగా 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.

ఇదిలావుంటే. కేంద్ర బడ్జెట్-2021లో మెట్రో రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేకుండా పోయింది. హైదరాబాద్‌లో మెట్రో అభివృద్ధికి గానీ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి కానీ ఎక్కడా పేర్కొనలేదు. కేవలం కేరళ, బెంగుళూర్, చెన్నై, నాగ్‌పూర్ మెట్రోల అభివృద్ధికి, రెండో దశ కేటాయింపులు జరిగాయి. చెన్నై మెట్రో రైలుకు రూ.63, 246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయింపులు జరిగాయి. వీటితో పాటు నాసిక్‌లో కొత్త కారిడార్ ఏర్పాటుకూ కేటాయింపులు జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మెట్రో గురించి మాత్రం ఆర్థికమంత్రి నిర్మల ఎక్కడా ప్రస్తావించలేదు.


Next Story
Share it