ఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయి. భద్రత పూర్తిగా అమలులో ఉంది. ఇండిగో విమానయాన సంస్థ జవాబుదారీగా ఉంది. భారతదేశ విమానయాన రంగాన్ని మరింత ప్రయాణీకుల కేంద్రీకృతంగా మార్చడానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాం. ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాము. ప్రణాళికా వైఫల్యాలు, నిబంధనలను పాటించకపోవడం ద్వారా ప్రయాణీకులకు ఇంత ఇబ్బంది కలిగింది.
దేశవ్యాప్తంగా అన్ని ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు సాధారణ పరిస్థితులు ఉన్నాయి,రద్దీ, ఇబ్బందులు లేవు. రిఫండ్,బ్యాగేజ్ ప్రయాణీకుల అందజేయడం పైసహాయక చర్యలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. DGCA ఇండిగో సంస్థకు షో-కాజ్ నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టింది. నివేదిక ఆధారంగా, కఠినమైన,తగిన చర్యలు తీసుకుంటాము..అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.