బీజేపీలోకి కమల్ నాథ్.. క్లారిటీ ఇచ్చిన నేతలు
కాంగ్రెస్ నేత కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
By Medi Samrat Published on 19 Feb 2024 2:54 PM ISTకాంగ్రెస్ నేత కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు కమల్‌నాథ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని, నకుల్‌నాథ్ బీజేపీలో చేరవచ్చని కూడా వార్తలు వచ్చాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పెద్ద నేత ఈ వార్తలకు ముగింపు పలికారు.
కమల్ నాథ్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ ప్రకటన వెలుగులోకి వచ్చింది. అవన్నీ పుకార్లే అని అన్నారు. బీజేపీలో చేరుతున్నట్లు కమల్‌నాథ్ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆయన సీనియర్ నేత, మాజీ సీఎం, పార్టీకి ఆస్తి అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలంతా కమల్ నాథ్ వెంటే ఉన్నారని.. నకుల్ నాథ్ విషయానికి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ తానేనని అన్నారు. ఆయన బాధ్యతాయుతమైన కుటుంబం నుండి వచ్చారు. ఆయన దాని తీవ్రతను అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ కూడా కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు తప్పని అన్నారు. నేను కమల్‌నాథ్‌తో మాట్లాడానని.. మీడియాలో వస్తున్నవన్నీ భ్రమేనని అన్నారు. నేను కాంగ్రెస్ వాదినేనని.. అలాగే ఉంటానని కమల్‌నాథ్ చెప్పారని పేర్కొన్నారు. కమల్‌నాథ్‌కు సన్నిహితుడైన మాజీ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ కూడా వార్తలను ఖండించారు. కమల్ నాథ్‌కు కాంగ్రెస్‌ను వీడే ఆలోచన లేదని చెప్పారు.