కుల వివక్షకు అదే అత్యుత్తమ ఉదాహరణ : ఉదయనిధి
తన వివాదాస్పద ప్రకటనపై వివరణ ఇస్తూ డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్..
By Medi Samrat Published on 6 Sep 2023 1:09 PM GMTతన వివాదాస్పద ప్రకటనపై వివరణ ఇస్తూ డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. పార్లమెంటు ప్రారంభ వేడుకలకు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడాన్ని లేవనెత్తారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని.. కుల వివక్ష వంటి శాశ్వతమైన పద్ధతులకు వ్యతిరేకమని అంగీకరించారు. పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించలేదని.. ఇదే అత్యుత్తమ ఉదాహరణ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తనను క్షమాపణ చెప్పాలని కోరుతాన్నారన్న డిమాండ్‌పై ప్రశ్నించగా.. అందుకు ఉదయనిధి నిరాకరించారు.
ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. "నిన్న ఒక ఫంక్షన్‌లో సనాతన ధర్మం గురించి మాట్లాడాను. ఏది మాట్లాడినా పదే పదే చెబుతాను. హిందువులనే కాదు అన్ని మతాలనూ కలుపుకుపోయాను. కులమతాల గురించి మాట్లాడాను అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన ప్రకటనపై పలువురు బీజేపీ నేతలు, హిందూ పూజారులు తీవ్ర విమర్శలు చేశారు. ఎంకే స్టాలిన్ కుమారుడు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నాయకులు ఉదయనిధి వ్యాఖ్యలకు ఇండియా కూటమిని నిందించారు. ఇటీవల ముంబైలో జరిగిన సమావేశంలో అటువంటి ఎజెండా గురించే చర్చించారని పేర్కొన్నారు.