గెలుస్తామన్న వ్యక్తిగత అహంతోనే కూటమి ఓడిపోయింది

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమిలో అంతా స‌వ్యంగా లేదు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫర్, శివసేన (యుబీటీ) బీజేపీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాల మధ్య, ఉద్ధవ్ ఠాక్రే మహావికాస్ అఘాడి గురించి పెద్ద ప్రకటన ఇచ్చారు.

By Medi Samrat
Published on : 19 July 2025 5:59 PM IST

గెలుస్తామన్న వ్యక్తిగత అహంతోనే కూటమి ఓడిపోయింది

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమిలో అంతా స‌వ్యంగా లేదు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫర్, శివసేన (యుబీటీ) బీజేపీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాల మధ్య, ఉద్ధవ్ ఠాక్రే మహావికాస్ అఘాడి గురించి పెద్ద ప్రకటన ఇచ్చారు.

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలల‌లో జ‌రిగిన‌ పొరపాట్లు భవిష్యత్తులోనూ జరుగుతూ ఉంటే, అప్పుడు కలిసి ఉండ‌టంలో అర్థం ఉండదని ఉద్ధవ్ అన్నారు. 2024లో మహావికాస్ అఘాడి విజయం కాకుండా పార్టీల వారీగా విజయం సాధించడంపైనే పోటీ కేంద్రీకృతమైందని, అందుకే కూటమి ఓడిపోయిందని ఉద్ధవ్ అన్నారు.

శివసేన (UBT) మౌత్‌పీస్ సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల సమయంలో తమ పార్టీ తన కూటమి భాగస్వాముల కోసం చాలా నియోజకవర్గాలను వదిలివేయవలసి వచ్చిందని, వాటిలో పార్టీ చాలా విజయాలు సాధించిందని అన్నారు. సీట్ల పంపకాలపై చివరి నిమిషం వరకు చర్చలు కొనసాగాయని ఉద్ధవ్ తెలిపారు. సీట్ల పంపకంలో జాప్యం, మిత్రపక్షాల మధ్య కుమ్ములాటలు ప్రజల్లో తప్పుడు సందేశాన్ని పంపాయని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ అద్భుత పనితీరు కనబర్చిన తర్వాత, పార్టీల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న వ్యక్తిగత అహం వచ్చి కూటమి ఓడిపోయిందని ఉద్ధవ్ అన్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిర్ణయించలేకపోవడంపై థాకరే విచారం వ్యక్తం చేశారు. ఇది పొరపాటని, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటే, కలిసి జీవించడంలో అర్థం లేదు. రాయితీలను ప్రకటించే రేసు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్‌చంద్ర పవార్), కాంగ్రెస్‌లతో కూడిన ఎంవిఎను ప్రతికూల స్థితిలోకి నెట్టిందని ఉద్ధవ్ అన్నారు.

Next Story