ఎలక్ట్రిక్ వాహనాలతో మాత్రమే బైక్ టాక్సీలను ఉపయోగించాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉబెర్ తప్పుబట్టింది. ఈ నిర్ణయం కారణంగా మా సెక్టార్‌ప్రమాదంలో పడిందని.. నగరంలోని 100,000 మందికి పైగా డ్రైవర్ల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందని తెలిపింది. కనీసం ఒక మిలియన్ మంది ప్రయాణికుల అవసరాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. పొల్యూషన్‌ను తగ్గించేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఢిల్లీ నగర పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈవీను మాత్రమే ట్యాక్సీలు వాడాలన్న ఢిల్లీ సర్కార్ అమలు చేయడం అసాధ్యమని, కావాలంటే దీనిపై సంబంధిత పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌ను కోరింది. ఉబర్ సంస్థ 2040 నాటికి క్యాబ్ ట్యాక్సీలుగా వాడే వాహనాలన్నీ కర్భన రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే మూడేండ్లలో 25 వేల ఈవీలను క్యాబ్ సర్వీసులుగా వాడనున్నట్లు ఉబర్ ప్రకటించింది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే బైక్ ట్యాక్సీలుగా అనుమతించే ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం ఖరారు చేస్తున్నట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు అగ్రిగేటర్ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి కైలాష్ గహ్లోత్ సోమవారం తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ₹5,000 అంతకంటే ఎక్కువ జరిమానా విధించనుంది. అయితే, Swiggy లేదా Zomato వంటి డెలివరీ సేవలకు ఈ నిషేధం వర్తించదు.