ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

Two Terrorists Killed In Encounter With Security Forces In Shopian.భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2021 12:00 PM IST
ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తమ‌య్యారు. శనివారం తెల్ల‌వారుజామున జ‌మ్ముక‌శ్మీర్‌లోని షోపియాన్ లో ఈ ఎన్‌కౌంట‌ర్ చోటు చేసుకుంది. చౌగం ప్రాంతంలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప‌క్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్‌ను ప్రారంభించాయి. ఆ క్ర‌మంలో ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తాబ‌ల‌గాల పైకి కాల్పులు జ‌రిపాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించార‌ని పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇంకా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా.. నిన్న జ‌మ్ముకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హ‌త‌మైన సంగ‌తి తెలిసిందే.

Next Story