తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రైలు పట్టాలు దాటుతున్న ఓ స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. కడలూరు సమీపంలో ఉన్న ఓ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పట్టాలను దాటుతుంది. అయితే రైలు రావడం గమనించని సిబ్బంది.. గేట్ వేయకపోవడంతో స్కూల్ బస్సు పట్టాలను క్రాస్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే వేగంగా వచ్చిన రైలు.. స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది.
దీంతో స్కూల్ బస్సుతో పాటు విద్యార్థులు గాల్లోకి ఎగిరి పది మీటర్ల దూరంలో పడిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మరికొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.