కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం..ఇద్దరు IAF పైలట్లు మృతి

అసోంలోని జోర్హాట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కు చెందిన సుఖోయ్-30 MKI యుద్ధ విమానం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కూలిపోయింది.

By -  Knakam Karthik
Published on : 6 March 2026 2:45 PM IST

National News, Assam, Karbi, Anuj, Purvesh Duragkar, Sukhoi-30MKI crash

కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం..ఇద్దరు IAF పైలట్లు మృతి

అసోంలోని జోర్హాట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కు చెందిన సుఖోయ్-30 MKI యుద్ధ విమానం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కూలిపోయింది. జోర్హాట్ ఎయిర్ బేస్ నుండి శిక్షణ కోసం టేకాఫ్ అయిన సుఖోయ్ యుద్ధ విమానం, కొద్దిసేపటికే రాడార్ నుండి మాయమైంది. గాలింపు చర్యల తర్వాత, ఈ విమానం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమానం శకలాలను భద్రతా దళాలు కనుగొన్నాయి.

సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానం, అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో సాధారణ శిక్షణా మిషన్ సమయంలో కూలిపోయిందని, ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారని భారత వైమానిక దళం ధృవీకరించింది.ప్రాణాలు కోల్పోయిన పైలట్లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ అని గుర్తించింది. వారి కుటుంబాలను అండగా ఉంటామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హామీ ఇచ్చింది.

Next Story