బెంగళూరులో ఘోరం..తండ్రి కళ్లముందే ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న స్కూల్ బస్సు

కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 12 Feb 2026 7:20 AM IST

Crime News, Karnataka, Bengaluru, Two Children  Killed, School Bus

బెంగళూరులో ఘోరం..తండ్రి కళ్లముందే ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న స్కూల్ బస్సు

కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. హెగ్డే నగర్‌లోని థనిసంద్ర మెయిన్ రోడ్డుపై ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను వర్ష (2), భాను (4) గా గుర్తించారు.

నగరంలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగనగౌడ మలిపాటిల్ బుధవారం ఉదయం తన కుమార్తె వర్ష (2) మరియు తన అన్న కుమార్తె భాను (4)ను తీసుకుని బైక్‌పై పాలు కొనడానికి బయలుదేరారు. థనిసంద్ర సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఒక ఇరుకైన మలుపులో బస్సు వస్తుండటం గమనించి నాగనగౌడ తన బైక్‌ను పక్కకు ఆపి వేచి చూశారు. అయితే, ఎదురుగా వస్తున్న హెజిమోని గ్లోబల్ స్కూల్ కు చెందిన బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా టర్న్ తీసుకోవడంతో బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

బస్సు ఢీకొనడంతో బైక్ పై ఉన్న చిన్నారులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. దురదృష్టవశాత్తు బస్సు వెనుక చక్రాలు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నాగనగౌడ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సిసిటివి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బస్సు డ్రైవర్ మలుపు తిరిగే సమయంలో బైక్ ఆగినా కూడా గమనించకుండా దూసుకురావడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story