హిందీపై డీఎంకే, బీజేపీ హ్యాష్‌ట్యాగ్స్..ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల గొడవ అని విజయ్ సెటైర్

హిందీ విషయంలో డీఎంకే, బీజేపీ.. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్లా గొడవ పడుతున్నట్లు ఉందని ఎగతాళి చేశారు.

By Knakam Karthik  Published on  26 Feb 2025 3:03 PM IST
National News, Tamilandu, TVK Vijay, Hindi Row, DMk, Bjp

హిందీపై డీఎంకే, బీజేపీ హ్యాష్‌ట్యాగ్స్..ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల గొడవ అని విజయ్ సెటైర్

తమిళనాడులో కొంతకాలంగా అధికార పార్టీ డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల నడుమ హిందీ భాష విషయంలో వివాదం కొనసాగుతుంది. అయితే దీనిపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ స్పందించారు. హిందీ విషయంలో డీఎంకే, బీజేపీ.. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్లా గొడవ పడుతున్నట్లు ఉందని ఎగతాళి చేశారు. రెండు పార్టీలు సోషల్ మీడియాలో ఒకరినొకరు వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ తమిళనాడు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాయని విజయ్ ఆరోపించారు. పార్టీ తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న విజయ్ ఈ కామెంట్స్ చేశారు.

నూతన విద్యా విధానం, త్రిభాష సూత్రం అమలుపై ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. దీన్ని రంగ స్థలంగా మార్చారు. డీఎంకే, బీజేపీ రెండూ పెద్ద పార్టీలైనా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ గేమ్స్ ఆడుకుంటున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. వారి వివాదం చిన్న పిల్లల గొడవలా ఉంది..అని విజయ్ ఎద్దేవా చేశారు.

త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోతే.. రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్ల నిధులను నిలిపివేస్తామంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన వార్తలపై విజయ్ స్పందించారు. కేంద్రం తీరును తప్పుపట్టారు. భాజపా, డీఎంకే నిజాయతీ లేని పార్టీలని దుయ్యబట్టారు. వారిని అధికారం నుంచి దించేయడమే మేలని.. 'గెట్ ఔట్' హ్యాష్ ట్యాగ్ పెట్టి వారిని సాగనంపడమే లక్ష్యంగా కలసికట్టుగా కృషి చేద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామని విజయ్ దీమా వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని చెప్పారు.

Next Story