టీవీకే చీఫ్ విజయ్ ఆస్తుల లెక్కలివే..రూ.600 కోట్లకు పైగా ఆస్తి, పైసా అప్పు లేదు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి నిలుస్తున్న టీవీకే (TVK) అధినేత విజయ్, సోమవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

By -  Knakam Karthik
Published on : 30 March 2026 10:00 PM IST

National News, Tamilnadu, Vijay, TVK, TamilNaduElections2026, Election Affidavit

టీవీకే చీఫ్ విజయ్ ఆస్తుల లెక్కలివే..రూ.600 కోట్లకు పైగా ఆస్తి, పైసా అప్పు లేదు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి నిలుస్తున్న టీవీకే (TVK) అధినేత విజయ్, సోమవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 52 ఏళ్ల విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు ₹603.20 కోట్లుగా ఉంది. ఇందులో ₹404.58 కోట్ల చరాస్తులు, చెన్నై మరియు కొడైకెనాల్‌లోని స్థిరాస్తుల విలువ ₹198.62 కోట్లుగా పేర్కొన్నారు. తన భార్య సంగీత పేరిట మరో ₹15.76 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, విజయ్‌కు బ్యాంకులకు గానీ, ఇతర ఆర్థిక సంస్థలకు గానీ ఎలాంటి అప్పులు లేవు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ₹184.53 కోట్ల ఆదాయాన్ని చూపగా, వివిధ బ్యాంక్ డిపాజిట్లలో ₹213 కోట్లు ఉన్నట్లు తెలిపారు. లగ్జరీ కార్లతో పాటు తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు ₹3.02 కోట్లు, భార్యకు ₹12.60 కోట్లు, టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్‌కు ₹3 కోట్లు వ్యక్తిగత రుణాలుగా ఇచ్చినట్లు వెల్లడించారు.

విద్యార్హతల విషయానికొస్తే, 1992లో చెన్నై లొయోలా కాలేజీలో బీఎస్సీ డిస్కంటిన్యూ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న విజయ్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. మే 4న విడుదలయ్యే ఫలితాలు ఈ స్టార్ హీరో రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి.

Next Story