కరెన్సీ నోట్లపై రాస్తే చెల్లవా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

True or False.. Writing any thing on currency notes makes them invalid. సోషల్‌ మీడియా రాకతో స్మార్ట్‌ఫోన్లలో వచ్చే వార్తలను నమ్మాలో లేక నమ్మకూడదో తెలియని

By అంజి  Published on  9 Jan 2023 7:30 AM IST
కరెన్సీ నోట్లపై రాస్తే చెల్లవా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

సోషల్‌ మీడియా రాకతో స్మార్ట్‌ఫోన్లలో వచ్చే వార్తలను నమ్మాలో లేక నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. సోషల్‌ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో రకాల వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఇంకా ముఖ్యంగా ఆ వార్తలు మన నిత్య జీవితానికి దగ్గరివైతే చాలా మంది ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. అందులోనూ బ్యాంకు ట్రాన్సక్షన్స్‌, కరెన్సీ నోట్లకు సంబంధించినవైతే ఎంతో ఆసక్తిగా చూస్తారు. సోషల్‌ మీడియాలో నిజమైన వార్తలతో పాటు ఫేకు వార్తలు వస్తుంటాయి. ఇటీవల కాలంలో కరెన్సీ నోట్లకు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

''రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొచ్చిన కొత్త రూల్స్‌ ప్రకారం.. నోట్లపై ఏవైనా పెన్నుతో రాసిన రాతలు ఉంటే అవి చెల్లుబాటు కావని, అలా రాయడం చట్టరీత్యా నేరం'' అని నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న న్యూస్‌ సారాంశం. అమెరికాలోనూ ఇలాంటి చట్టం అమల్లో ఉందంటూ.. దీనికి మరింత బలం చేకూర్చేలా వదంతులు పుట్టిస్తున్నారు. అయితే కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే చెల్లుబాటు కావంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

సోషల్‌ మీడియాలో వచ్చే ఆ వార్తలన్ని.. తప్పుడు వార్తలని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో పేర్కొంది. అయితే కరెన్సీ నోట్లను క్లీన్‌గా ఉంచాలన్న ఉద్దేశంతో నోట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పెన్నుతో రాతలు రాస్తే.. నోట్లు చూసేందుకు బాగుండవని, అంతేకాకుండా వాటి జీవతకాలం తగ్గుతుందని పీఐబీ తెలిపింది. సో.. నోట్లపై ఎలాంటి రాతలు ఉన్న చెల్లుతాయి. కానీ వాటిపై రాయకపోవడం మంచిది.


Next Story