అయోధ్యకు బాణాసంచా తరలిస్తున్న లారీ.. ఊహించని ప్రమాదం

తమిళనాడు నుంచి అయోధ్యకు బాణసంచా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు మంటల్లో చిక్కుకుంది.

By Medi Samrat  Published on  17 Jan 2024 1:45 PM GMT
అయోధ్యకు బాణాసంచా తరలిస్తున్న లారీ.. ఊహించని ప్రమాదం

తమిళనాడు నుంచి అయోధ్యకు బాణసంచా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. ఉన్నావ్‌లోని పూర్వ కొత్వాలిలోని ఖర్గి ఖేడా గ్రామంలో అర్థరాత్రి అయోధ్యకు వెళ్తున్న ట్రక్కు దగ్ధమైందని అధికారులు తెలిపారు. స్థానికులు రికార్డ్ చేసిన వీడియోల ప్రకారం.. ట్రక్కులోనే బాణసంచా కాలడంతో మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేలోపే ట్రక్కు పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు.

ఈ నెల 22న అయెధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి అయోధ్యకు భారీగా బాణసంచాను లారీలో రవాణా చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌ జిల్లాలోని ఖర్గి ఖేడా గ్రామానికి ఆ లారీ చేరుకోగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని బాణసంచా అంతా పేలిపోయింది. ఈ మంటలకు ఆ లారీ పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు.

Next Story