తృటిలో చావు నుండి తప్పించుకున్న కౌన్సిలర్

తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్, సుశాంత ఘోష్ హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు.

By Kalasani Durgapraveen  Published on  16 Nov 2024 1:30 PM IST
తృటిలో చావు నుండి తప్పించుకున్న కౌన్సిలర్

తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్, సుశాంత ఘోష్ హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు. కోల్‌కతాలో అతడిని చంపేయాలని కొందరు చూడగా తృటిలో తప్పించుకున్నారు. చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి తుపాకీ పనిచేయకపోవడంతో పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులని ఘోష్, ఇతర స్థానికులు, తృణమూల్ మద్దతుదారుల సహాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘోష్ నివాసం ముందు జరిగిన ఈ నాటకీయ సంఘటన సీసీటీవీలో రికార్డయింది.

ఘోష్ తన నివాసం వెలుపల కూర్చుని ఉండగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రివాల్వర్‌తో ఆయుధం పట్టుకున్న వ్యక్తి కౌన్సిలర్‌ను అతి సమీపం నుండి కాల్చడానికి ప్రయత్నించాడు. అయితే, తుపాకీ పనిచేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తమ ప్లాన్ విఫలమవడంతో బైక్ పైన వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అరెస్టు చేసిన వ్యక్తి నుంచి రివాల్వర్‌, రెండు మ్యాగజైన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story