స్పామ్ కాల్స్‌కి చెక్ పెట్టేలా ట్రాయ్ కొత్త సిస్టమ్
ట్రూకాలర్ యాప్ ద్వారా కాలర్ పేరు తెలుసుకునే అవసరం ఇక తగ్గిపోనుంది.
By - Knakam Karthik |
స్పామ్ కాల్స్‌కి చెక్ పెట్టేలా ట్రాయ్ కొత్త సిస్టమ్
ట్రూకాలర్ యాప్ ద్వారా కాలర్ పేరు తెలుసుకునే అవసరం ఇక తగ్గిపోనుంది. భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) మరియు టెలికాం శాఖ (DoT) “CNAP” – Calling Name Presentation అనే కొత్త సిస్టమ్‌ను అమలు చేయబోతున్నాయి. ఈ సిస్టమ్ ద్వారా కాల్ వస్తున్నప్పుడు కాల్ చేస్తున్న వ్యక్తి పేరు మరియు ఫోన్ నంబర్ నేరుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంటే ఇకపై ఎటువంటి యాప్ అవసరం లేకుండా, నెట్‌వర్క్ నుంచే సమాచారం వస్తుంది.
ప్రధాన అంశాలు:
మొదటగా 4G, 5G నెట్‌వర్క్‌లలో ఈ ఫీచర్ అమలు కానుంది.
తర్వాత 2G యూజర్లకు కూడా దశలవారీగా అందుబాటులోకి తెస్తారు.
స్పామ్ కాల్స్‌ను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ట్రూకాలర్ వంటి యాప్‌ల అవసరం గణనీయంగా తగ్గిపోవచ్చు.
టెలికాం రంగ నిపుణుల ప్రకారం, ఈ సిస్టమ్ వల్ల వినియోగదారుల భద్రత, పారదర్శకత పెరుగుతుందని, అదే సమయంలో దుర్వినియోగ కాల్స్ తగ్గుతాయని అంచనా.భారత టెలికాం నెట్‌వర్క్‌లలో త్వరలోనే ప్రతి కాల్‌లో “పేరు మరియు నంబర్” చూపించే కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సిస్టమ్ రాబోతోంది.