కన్వర్ యాత్రలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
యూపీలోని మీరఠ్‌లో కన్వర్ యాత్రలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఐదుగురు యాత్రికులు మృతి చెందారు.
By అంజి Published on 16 July 2023 1:00 PM ISTకన్వర్ యాత్రలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
యూపీలోని మీరఠ్‌లో కన్వర్ యాత్రలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఐదుగురు యాత్రికులు మృతి చెందారు. కన్వర్ యాత్రకు వెళ్తున్న ఓ డీజే ట్రక్కు.. ప్రమాదవశాత్తు ఓ హైటెన్షన్ విద్యుత్ వైర్‌ని తలిగింది. దీంతో ఐదుగురు యాత్రికులు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. భవన్‌పుర్ ప్రాంతంలోని చిలౌర రాలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి కన్వర్ యాత్రకు వెళ్తున్న ఓ ట్రక్.. మార్గం మధ్యలో హైటెన్షన్ వైరును తగిలింది. దీంతో వాహనం మొత్తం కరెంట్ వ్యాపించింది. దీంతో యాత్రికులు ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి బాధిత బంధువులకు కూడా సమాచారం చెరవేశారు. కన్వరీల మృతిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే కన్వరీలు మరణించారని స్థానికులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.