ఆమె ఏమైనా హంతకురాలా? పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
పూజా ఖేద్కర్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By Knakam Karthik
ఆమె ఏమైనా హంతకురాలా? మాజీ ఐ పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
2022 సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించడానికి OBC నాన్-క్రీమీలేయర్ కోటాను దుర్వినియోగం చేసి, నకిలీ పత్రాలను సృష్టించారనే ఆరోపణలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పూజా ఖేద్కర్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రతను బట్టి చూస్తే ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓబీసీ సర్టిఫికెట్‌తో వికలాంగుల కోటా ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలో పాసైనట్లు చూపించి ఉద్యోగం సంపాదించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. జస్టిస్ బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పూజా ఖేద్కర్ విచారణకు సహకరించాలని కోరారు. అలాగే ఆమె డ్రగ్ లార్డ్, ఉగ్రవాది కాదని, 302 సెక్షన్ కింద నేరమేమైనా చేసిందా? ఎన్డీపీఎస్ నేరానికి పాల్పడిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్నీ కోల్పోయిందని, ఇక ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరకదని పేర్కొంది.
కాగా.. పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీస్ తరపు లాయర్ వ్యతిరేకించారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలున్నాయని, విచారణకు సహకరించడం లేదని వాదించారు. 2022 యూపీఎస్సీ అప్లికేన్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకే ఢిల్లీ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.