జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడిపై రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడికి కచ్ఛితంగా ధీటైన సమాధానం ఇస్తాం. తీవ్ర వాదాన్ని సహించేది లేదు. భారత్ ప్రతిచర్య ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం త్వరలో చూస్తుంది. దాడి చేసిన వారే కాకుండా వారి వెనుక ఉన్న రహస్య హస్తాలను కూడా తెరపైకి తీసుకొస్తాం. పహల్గామ్ దాడికి పాల్పడిన వారు కచ్ఛితంగా గట్టి చర్యలను ఎదుర్కొంటారు..అని రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
పహల్గామ్‌లో జరిగిన పిరికి చర్యలో మనం చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాము. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నా. ఉగ్రవాదంపై భారతదేశం యొక్క సంకల్పాన్ని నేను పునరావృతం చేయాలనుకుంటున్నా. ఉగ్రవాదం పట్ల మనకు సున్నా సహన విధానం ఉంది. ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.