రైల్వే పరీక్షలో అభ్యర్థి అతి తెలివి.. చీటింగ్‌లో ఇది నెక్ట్స్‌ లెవల్‌

To Clear Railway Exam, Aspirant Removes Thumb Skin, Puts on Friend's Hand. రైల్వే ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలన్న కసితో ఓ అభ్యర్థి అతి తెలికి పోయాడు. తనకు బదులుగా ఫ్రెండ్‌ని పరీక్ష

By అంజి  Published on  25 Aug 2022 12:40 PM GMT
రైల్వే పరీక్షలో అభ్యర్థి అతి తెలివి.. చీటింగ్‌లో ఇది నెక్ట్స్‌ లెవల్‌

రైల్వే ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలన్న కసితో ఓ అభ్యర్థి అతి తెలికి పోయాడు. తనకు బదులుగా ఫ్రెండ్‌ని పరీక్ష రాయించేందుకు ప్రయత్నించాడు. అయితే పరీక్ష రాయాలంటే.. బయోమెట్రిక్‌ వేయాలి. ఇందు కోసం తన బొటన వేలు చర్మాన్ని తొలగించి ఫ్రెండ్‌ వేలికి అంటించాడు. అయితే పరీక్షా కేంద్రం వద్ద ఫ్రెండ్‌ వేలికి అంటించిన చర్మంతో థంబ్‌ పడకపోవడంతో పరీక్షా పర్యవేక్షకుడికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత అతడి చేయి పై శానిటైజర్‌ పోయడంతో అంటించిన చర్మం ఊడిపోయింది. దీంతో బండారం బయటపడింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముంగేర్‌ జిల్లాకు చెందిన మనీష్‌ కుమార్‌ (20) ఎలాగైనా రైల్వేలో జాబ్‌ సంపాదించాలనుకున్నాడు. దీని కోసం డీ గ్రూప్‌ పోస్టు కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే చదువులో ఎంతో ముందుండే తన ఫ్రెండ్‌ రాజ్యగురు గుప్తాతో రైల్వే పరీక్ష రాయించాలనుకున్నాడు. దీని కోసం అతడిని ఎలాగోలా బతిమాలి ఒప్పించాడు. అలాగే పరీక్ష కేంద్రం వద్ద బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌లో ఫ్రెండే తానుగా నమ్మించేందుకు మనీష్‌ కుమార్‌ భారీ స్కెచ్‌ వేశాడు. పరీక్షకు ఒక రోజు ముందు కాలుతున్న పెన్నంపై తన బొటనవేలు ఉంచాడు. వేడికి కమిలి ఊడిన పైచర్మాన్ని మెల్లగా తొలగించి ఫ్రెండ్ రాజ్యగురు గుప్తా కుడి చేయి బొటనవేలికి అంటించాడు. ఆ తర్వాత రైల్వే పరీక్ష పంపించాడు.

ఈ నెల 22న వడోదరలోని లక్ష్మీపుర ప్రాంతంలో రైల్వే పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రానికి మనీష్‌ కుమార్‌ తరుఫున అతడి స్నేహితుడు రాజ్యగురు గుప్తా వెళ్లాడు. అయితే బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ కోసం బొటనవేలితో చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ థంబ్‌ వెరిఫికేషన్‌ సక్సెస్‌ కాలేదు. అలాగే రాజ్యగురు గుప్తా తన కుడి చేతిని ఫ్యాంటు జేబులో దాచి ఉంచడంతో పరీక్షా పర్యవేక్షకుడు అనుమానం వచ్చింది. చెక్‌ చేయడం కోసం అతడి కుడి చేతి బొటనవేలిపై శానిటైజర్‌ పోశాడు. దీంతో అంటించిన చర్మం ఊడి.. కింద పడింది. దీంతో రాజ్యగురు గుప్తాను పోలీసులకు అప్పగించారు. దీంతో అతడు అసలు విషయం చెప్పాడు. అసలు అభ్యర్థి మనీష్‌ కుమార్‌తోపాటు చీటింగ్‌కు సహకరించిన స్నేహితుడు రాజ్యగురు గుప్తాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story