ఎంపీ మ‌హువా మోయిత్రా నృత్యం.. సోష‌ల్ మీడియోలో వైర‌ల్‌

TMC's Mahua Moitra dances during Durga Puja celebrations. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో దుర్గాపూజ సందర్భంగా జరిగిన మహాపంచమి వేడుకల

By Medi Samrat  Published on  1 Oct 2022 3:47 PM IST
ఎంపీ మ‌హువా మోయిత్రా నృత్యం.. సోష‌ల్ మీడియోలో వైర‌ల్‌

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో దుర్గాపూజ సందర్భంగా జరిగిన మహాపంచమి వేడుకల వీడియోను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మోయిత్రా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. మోయిత్రా ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేస్తూ.. "నాడియాలో జరిగిన మహాపంచమి వేడుకల‌లో మ‌ధుర‌మైన‌ క్షణాలు" అని రాశారు.

మ‌హాపంచ‌మి వేడుకల ఊరేగింపులో అనేక మంది మహిళలు బెంగాలీ జానపద గీతం 'సోహగ్ చంద్ బోడోని ధోనీ నాచో తో దేఖీ'కి నృత్యం చేయడం చూడవచ్చు. వేడుకలలో పాల్గొన్న ఎంపీ మ‌హువా మోయిత్రా తన నృత్య నైపుణ్యాలను చూపడంతో పాటు పాటను కూడా పాడింది. తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజున మహాపంచమి జ‌రుపుకుంటారు. మహాపంచమి శుక్రవారం జరుపుకున్నారు. స్కందమాతకు భ‌క్తులు పూజ‌లు చేశారు.



Next Story