మ‌హిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ.. వీడియో వైర‌ల్‌

TMC MP pulling cheeks of woman MLA video shared by BJP.ప‌శ్చిమ బెంగాల్‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 10 March 2021 10:50 AM IST

TMC MP pulling cheeks of woman MLA video shared by BJP

ప‌శ్చిమ బెంగాల్‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఓ ప‌క్క బీజేపీ మ‌రో ప‌క్క టీఎంసీ(తృణ‌మూల్ కాంగ్రెస్‌) పోటా పోటిగా ప్ర‌చారం చేస్తున్నాయి. మ‌రోసారి విజ‌యం సాధించాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఆమె ఒక్క‌తే బీజేపీని ధైర్యంగా ఎదుర్కొంటుండ‌గా.. ఆ పార్టీ నాయ‌కులు చేసే ప‌నులు దీదీని ఇరుకున పెడుతున్నాయి. తాజాగా టీఎంసీ ఎంపీ త‌మ పార్టీకే చెందిన ఓ మ‌హిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు. బీజేపీ లోక్‌సభ ఎంపీ లాకెట్‌ చట్టర్జీ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం అని బీజేపీ ఎంపీ లాకెట్‌ చట్టర్జీ ఆ వీడియోకి క్యాష్ప‌న్ పెట్టారు. ఈ వీడియోలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ మరి కొందరు నాయకులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. వీరితో పాటు బాన్‌కురా మహిళా ఎమ్మెల్యే కూడా ఈ ప్రెస్‌ మీట్‌కు హాజరయ్యారు. ఇక మీడియా సమక్షంలోనే అందరూ చూస్తుండగా కళ్యాణ్‌ బెనర్జీ సదరు మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఎంటంటే..? ఆ మ‌హిళా ఎమ్మెల్యేకు టీఎంసీ ఈ సారి టికెట్ కూడా ఇవ్వ‌లేదు. అయితే.. ఈ ఘ‌ట‌న ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగింది అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. అయిన‌ప్ప‌టికి ఈ వీడియో ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుదుమారం రేపుతోంది.

బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ట్వీట్‌పై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పందించారు. " వారు త‌మ డర్టీ మైండ్‌ను బయటపెట్టుకున్నారు. అన్నా చెల్లెలి రిలేషన్ ఏంటో వారు తెలుసుకోవాలి. నేను కూడా బాన్‌కురా నియోజకవర్గానికి చెందిన వాడినే. 25 ఏళ్లుగా ఆమెను చెల్లిగా చూసుకుంటున్నా. డర్టీ మైండ్ ఉన్న లాకెట్ ఛటర్జీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి." అని ట్వీట్ చేశారు.




Next Story