ప్రయాణీకులకు అల‌ర్ట్‌.. టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో మార్పులు చేసిన రైల్వే బోర్డు

రైల్వే బోర్డు (ఇండియన్ రైల్వేస్) టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో కొత్త సవరణ చేసింది.

By Medi Samrat  Published on  17 Oct 2024 11:21 AM GMT
ప్రయాణీకులకు అల‌ర్ట్‌.. టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో మార్పులు చేసిన రైల్వే బోర్డు

రైల్వే బోర్డు (ఇండియన్ రైల్వేస్) టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో కొత్త సవరణ చేసింది. ఇప్పటి వరకు ఏ ప్రయాణికుడైనా తన ప్రయాణానికి 120 రోజుల ముందు టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది. రైల్వే బోర్డు ఈ కాల వ్యవధిని సగానికి అంటే 60 రోజులకు తగ్గించింది. ఈ మేరకు రైల్వే బోర్డు డైరెక్టర్ (ప్యాసింజర్ మార్కెటింగ్) సంజయ్ మూంచా ఉత్తర్వులు జారీ చేశారు.

జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. ప్రయాణికులు 31 అక్టోబర్ 2024 వరకు 120 రోజుల ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుంది. కొత్త విధానం నవంబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. అయితే, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ నిబంధన చెల్లదు. వారు ప్రయాణానికి 365 రోజుల ముందుగానే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా గతంలో బుక్ చేసుకున్న టిక్కెట్‌ను రద్దు చేసుకోవాల‌నుకుంటే.. 60 రోజుల ముందుగానే రద్దు చేసుకోవచ్చు. అదే సమయంలో తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ నియమాలు అలాగే ఉంటాయి. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీపావళి, ఛత్ దృష్ట్యా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. దేశవ్యాప్తంగా 28 ప్రత్యేక రైళ్లను నడపడానికి భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది.

Next Story