అమ్మకానికి 848 కేజీల వాడేసిన గ్లౌజులు.. కడిగి ఆరబెట్టి..

Three arrested for selling used surgical gloves. వాడిన పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లౌజులు శుభ్రం చేసి అమ్ముకుంటూ మరి కొందరు డబ్బులు సంపాదించుకుంటున్నారు.

By Medi Samrat  Published on  27 May 2021 11:55 AM GMT
surgical gloves

కోవిడ్ తో ప్రపంచం గడగడలాడించి పోతుంటే ఇదే సమయం అనుకుని డబ్బు సంపాదించే పనిలో పడిన అక్రమార్కులను అడుగడుగునా చూస్తున్నాం.. మందులు బ్లాక్లో అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకుంటుంటే.. వాడిన పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లౌజులు శుభ్రం చేసి అమ్ముకుంటూ మరి కొందరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ మధ్య ఇండోనేసియాలో కోవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగించిన 'నాజల్ స్వాబ్ టెస్ట్ కిట్'లను కడిగేసి మళ్లీ విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో కొంత మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మొన్న మధ్య ప్రదేశ్ లో వాడిన పీపీఈ కిట్ల‌ను నాశ‌నం చేయ‌కుండా బ‌యో వేస్ట్ ప్లాంట్ వేడి నీటిలో శుభ్రం చేసి విక్ర‌యిస్తున్న‌ట్లుగా ప‌రిశోధ‌న‌లో తేలింది. సత్నా-భోపాల్ బహిరంగ మార్కెట్లో విక్రయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇప్పుడు తాజాగా 848 కేజిల వాడినహ్యాండ్ గ్లౌజులను, వీటిని అమ్మేయడానికి ప్రయత్నించే ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాడేసిన వాటిని వాషింగ్ మెషిన్ లలో వేసి కడిగి, కొన్ని రసాయనాల సహాయం తో ఆరబెట్టి, కొత్త బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి వాటిని మరో సారి ఉపయోగించే విధంగా అమ్మేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో ఇలాంటి సంఘటన జరగడం రెండవసారి. గతంలో కూడా పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లోజులు తిరిగి విక్రయించే కొందరు వ్యక్తులను పోలీసులు కడుపులోకి తీసుకున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లౌజులు, మాస్క్‌లు ఒక్కసారి మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అలాగే, వాటిని బహిరంగ ప్రదేశంలో విసిరేయకూడదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో బయో వ్యర్థాలను పారవేసే కర్మాగారంలో నాశనం చేయాలి.



Next Story