కొవిడ్‌తో నాడీ సంబంధ సమస్యలు.. నివేదికలు ఏమంటున్నాయంటే.!

Threat to brain with corona virus. కొవిడ్‌ కారణంగా మనిషి శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నా అంటే.. అవుననే సమాధానం

By అంజి  Published on  27 Oct 2021 1:47 PM IST
కొవిడ్‌తో నాడీ సంబంధ సమస్యలు.. నివేదికలు ఏమంటున్నాయంటే.!

కొవిడ్‌ కారణంగా మనిషి శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న కొందరు బాధితుల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా బాధితుల్లో అరుదైన నాడీ సంబంధ సమస్యలు తలెత్తున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ను అరికట్టేందుకు వైద్య శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లతోనూ ఇలాంటి ద్రష్ప్రభావాలే ఉంటున్నట్లు నిపుణులు తమ పరిశోధనల్లో తేల్చారు. ఈ అంశంపై ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు చాలా డీప్‌గా పరిశోధనలు చేశారు. కొవిడ్‌ కారణంగా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తేల్చేందుకు బ్రిటన్‌కు చెందిన 3.2 కోట్ల మంది ఆరోగ్య వివరాలను శాస్త్రవేత్తలు సేకరించారు.

కరోనా వైరస్‌ సోకిన తర్వాత 28 రోజుల్లో, గుర్తింపు పొందిన వ్యాక్సిన్‌ ఫస్ట్‌డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల్లో.. శరీరంలో మార్పులపై, ముఖ్యంగా ఎలాంటి నాడీ సంబంధ సమస్య తలెత్తాయన్న దానిపై శాస్త్రవేత్తలు విశ్లేషణలు జరిపారు. ఆస్ట్రాజెనికా లేదా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోసు తీసుకున్న వారిలో కొందరికి పెరాలసిస్‌, మెదడులో రక్తస్రావం స్వల్పంగా ఉంటోందని పరిశోధనకర్త కరోల్‌ కూప్లాండ్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 10 వేల మందిలో సగటున ఒకరికి ఈ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలతో పోలిస్తే.. కొవిడ్‌ కారణంగానే నాడీ సంబంధ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు.

Next Story