దొంగతో కలిసి భోజనం చేసిన సీఎం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ఓ దొంగ ఏకంగా ముఖ్యమంత్రి పక్కన కూర్చుని భోజనం చేశాడు. విందులో పాల్గొని సీఎంతో ముచ్చటించాడు. ఇద్దరూ ముచ్చట్లు
By అంజి Published on 18 April 2023 9:30 AM IST
దొంగతో కలిసి భోజనం చేసిన సీఎం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ఓ దొంగ ఏకంగా ముఖ్యమంత్రి పక్కన కూర్చుని భోజనం చేశాడు. విందులో పాల్గొని సీఎంతో ముచ్చటించాడు. ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆహారాన్ని ఆరగించారు. ఇక ఆ వ్యక్తి ఎవరో తెలియని సీఎం.. భోజనం మధ్యలో దొంగ వీపును తట్టిన ఘటన మధ్య ప్రదేశ్‌లో జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన కూర్చొని దొంగ అరవింద్ గుప్తా భోనం చేశాడు. కలప దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన అరవింద్.. సీఎం పక్కన కూర్చుని భోజనం చేయడం పలు విమర్శలకు దారితీసింది. ఇక్కడ సీఎం భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. సోమవారం నాడు సిద్ధి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో శివరాజ్‌సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి విందులో కూర్చున్నారు. ఆ సమయంలో సీఎం సెక్యూరిటీ కళ్లుగప్పి మరీ అరవింద్ గుప్తా అక్కడికి వచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకుని సీఎం దగ్గరికి వచ్చి, సీఎం పక్కనే కూర్చుని భోజనం చేశాడు. ఈ ఘటనపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా పంచాయతీ అధికారి, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ 10న అరవింద్ గుప్తా కలప దొంగతనం కేసులో జైలుకెళ్లాడు. రెండు రోజుల పాట జైల్లో ఉండి.. బెయిల్‌పై విడుదలయ్యాడు. ఫారెస్ట్ యాక్ట్ 1927లోని సెక్షన్లు 2, 26, 52 ప్రకారం.. పోలీసులు అరవింద్‌పై చోరీ, స్మగ్లింగ్ కేసులు పెట్టి జైలుకు పంపించారు.