ఒడిశా రైలు ప్రమాదం: తప్పుడు సిగ్నలింగే విషాదానికి ప్రధాన కారణం
"తప్పుడు సిగ్నలింగ్" వల్లే ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 July 2023 8:46 AM GMTఒడిశా రైలు ప్రమాదం: తప్పుడు సిగ్నలింగే విషాదానికి ప్రధాన కారణం
"తప్పుడు సిగ్నలింగ్" వల్లే ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది. రెండు ట్రాక్‌ల స్విచ్‌ల పనితీరులో లోపాలు కనిపించి ఉంటే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగాలు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఉండాల్సిందని హై లెవల్ కమిషన్ అభిప్రాయపడింది. లెవల్ క్రాసింగ్ గేట్ 94 వద్ద అనుమతి పొందిన సర్క్యూట్ డయాగ్రామ్‌ను ఎలక్ట్రికల్ లిఫ్టింగ్ బారియర్ స్థానంలో సరఫరా చేయకపోవడం తప్పుడు వైరింగ్‌కు దారి తీసిందని తెలిపింది.
రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) రైల్వే బోర్డుకు సమర్పించిన స్వతంత్ర విచారణ నివేదికలో సిగ్నలింగ్ పనిలో లోపాలు ఉన్నప్పటికీ, రెండు సమాంతర ట్రాక్‌లను కలిపే స్విచ్‌ల విషయంలో సిబ్బంది చర్యలు తీసుకుని ఉండి ఉండాల్సిందన్నారు. రెండు ట్రాక్‌ల స్విచ్‌ల పనితీరులో లోపాలు కనిపించి ఉంటే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభా గాలు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఉండాల్సిందని కమిషన్ అభిప్రాయపడింది. లెవల్ క్రాసింగ్ గేట్ 94 వద్ద అనుమతి పొందిన సర్క్యూట్ డయాగ్రామ్‌ను ఎలక్ట్రికల్ లిఫ్టింగ్ బారియర్ స్థానంలో సరఫరా చేయకపోవడం తప్పుడు వైరింగ్‌కు దారి తీసిందని తెలిపింది.ఇంతకు ముందు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు దర్యాప్తులు జరిగాయి.
ఈ క్రమంలో ఇచ్చిన నివేదికల్లో తీసుకోవల్సిన చర్యలు, దిద్దుబాట్ల గురించి పేర్కొన్నారు. వీటిని పాటించి ఉంటే, నివారణ చర్యలకు దిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోయేదని నివేదికలో స్పష్టం చేశారు. సిగ్నలింగ్ పద్దతులలో మానవ, యాంత్రిక ప్రమేయాలు ఉంటాయి. సమన్వయం తప్పితే ఇటువంటి ఘోర ప్రమాదాలే చోటుచేసుకుంటాయని ఈ ఘటన తేల్చిందని వివరించారు. రెండు సమాంతర ట్రాక్‌ల సంబంధిత సిగ్నల్స్ స్విచ్చ్‌లు రైళ్లు వేళ్లే దశలో అసాధారణ రీతిలో పనిచేయడం గురించి ముందుగానే బహానాగా బజార్ స్టేషన్ మేనేజర్‌కు తెలియచేశారని, అయితే దీనిపై స్పందించిన దాఖలాలు కనబడటం లేదని నివేదికలో తేల్చారు. లెవల్ క్రాసింగ్ గేటు 94వద్ద బారియర్‌ల ఎత్తివేతను ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ ద్వారా చేపట్టారు. దీనితో తలెత్తిన తప్పిదం నష్టాన్ని తెచ్చిపెట్టిందని నివేదికలో తెలిపారు.
2022 మే 16న ఇటువంటి ప్రమాదమే సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లో ఉన్న బంకారనాయాబాజ్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి రాంగ్ వైరింగ్, కేబుల్ లోపాలే కారణం అని నివేదికలు తేల్చాయని అయితే దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే, సిగ్నల్ వ్యవస్థను చక్కదిద్ది ఉంటే ఇప్పుడు ఈ ఘటన జరిగి ఉండకుండా ఉండేదని తెలిపారు.
2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖరగ్ పూర్ డివిజన్ బ్యాంక్‌రనాయబాజ్ స్టేషన్ వద్ద తప్పు వైరింగ్, కేబుల్ లోపం కారణంగా జరిగిన ఘటనను నివేదికలో ప్రస్తావించింది కమిషన్. అలాగే.. లోపం సరిచేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే బోర్డుకు సూచించింది కమిషన్.
జూన్ 2వ తేదీ రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరగ్గా.. 292 మంది మృతి చెందగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఆగి ఉన్న గూడ్సురైలును బహానగాబజార్ రైల్వేస్టేషన్ వద్ద కోరమండల్ ఢీకొని పట్టాలు తప్పడం, ఆ పెట్టెలు ఎగిరిపడి, పక్కనున్న మార్గంలో వస్తున్న యశ్వంతపుర్ రైలుకు అడ్డంగా పడ్డాయి. అటువంటి ప్రమాదం జరిగిన సమయంలో ప్రతిస్పందన వేగంగా ఉండాలన, జోనల్ రైల్వేలలో విపత్తు-ప్రతిస్పందన వ్యవస్థను సమీక్షించాలని రిపోర్టులో తెలిపారు. జోనల్ రైల్వేలు NDRF, SDRF వంటి వివిధ విపత్తు-ప్రతిస్పందన దళాల మధ్య సమన్వయాన్ని సమీక్షించాలని రైల్వే సేఫ్టీ కమిషన్ సూచించింది.