ఆవు పేడను తిన్న వైద్యుడు.. వీడియో వైరల్‌.!

The doctor who ate cow dung. కొందరు ఆవు మూత్రం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతుంటారు. మరి కొందరు పంచామృతాల పేరుతో ఆవు మూత్రాన్ని సేవిస్తుంటారు.

By అంజి  Published on  18 Nov 2021 8:38 PM IST
ఆవు పేడను తిన్న వైద్యుడు.. వీడియో వైరల్‌.!

కొందరు ఆవు మూత్రం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతుంటారు. మరి కొందరు పంచామృతాల పేరుతో ఆవు మూత్రాన్ని సేవిస్తుంటారు. అయితే తాజాగా ఓ వైద్యుడు ఆవు పేడను తిన్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ మనోజ్‌ మిత్తల్‌.. ఆవు పేడ తిన్న అనారోగ్యానికి గురి కాకుండా ఉండొచ్చని చెబుతున్నారు. ఆవు మూత్రం, పేడ తినడం వల్ల చాలా రోగాలు మన దగ్గరికి రావని పేర్కొన్నారు. ఇక మహిళలకు అయితే ఇది సాధారణ ప్రసవం జరిగేలా చేస్తుందని తెలిపారు.

ఆవు పేడ తిన్న తర్వాత.. మనిషి శరీరం, మనసు, ఆత్మ పరిశుభ్రం అవుతాయని చెప్పాడు. వైద్యుడు మనోజ్‌ మిత్తల్‌ ఆవు పేడ తినడంపై సోషల్‌ మీడియాలో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు వైద్యుడు చెప్పినట్లు ఆవు పేడ తింటే ఆరోగ్యంగా ఉంటామని వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం వైద్యుడి సలహాలను తప్పుబడుడతున్నారు. ఇంకొందరు ప్రజలకు వైద్యం చేయకుండా వైద్యుడి లైసెన్స్‌ రద్దు చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story