మహారాష్ట్రలోని థానేలో తొమ్మిదేళ్ల బాలుడి తల్లిదండ్రులు ఓ ఆసుపత్రి వైద్యులపై సంచలన ఆరోపణలు చేశారు. గాయమైన కాలుకు కాకుండా తమ కుమారుడి ప్రైవేట్ భాగానికి శస్త్రచికిత్స చేశారని ఆరోపించారు. బాలుడి తల్లిదండ్రుల ప్రకటన ప్రకారం, అతను గత నెలలో తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు కాలికి గాయమైంది, దీంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.
జూన్ 15న షాహాపూర్‌లోని సబ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. వైద్యులు అతని కాలికి గాయమవ్వగా.. ప్రైవేట్ పార్ట్‌కు సున్తీ శస్త్రచికిత్స చేశారని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. విషయం బయటకు వెళుతుందని భావించిన వైద్యులు, గాయపడిన అతని కాలికి వెంటనే శస్త్రచికిత్స చేశారని బాలుడి తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు.పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు, ఆ తర్వాత ఆరోగ్య అధికారి ఎపిసోడ్‌పై విచారణకు హామీ ఇచ్చారు. వైద్య అధికారి మాత్రం బాలుడికి కాలు గాయంతో పాటు ఫిమోసిస్ (బిగుతైన ముందరి చర్మం) సమస్య కూడా ఉందని చెప్పారు. అందుకే వైద్యులు రెండు ఆపరేషన్లు చేయవలసి వచ్చిందని వివరించారు. డాక్టర్లు చేసింది సరైనదే.. ఎలాంటి తప్పు లేదని అంటున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం తమకు చెప్పకుండా పిల్లాడి ప్రైవేట్ పార్ట్ కు ఆపరేషన్ చేశారని అంటున్నారు.