మరాఠా రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్

మహారాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. చాలా కాలం తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిశారు.

By Medi Samrat
Published on : 5 July 2025 1:49 PM IST

మరాఠా రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్

మహారాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. చాలా కాలం తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. ఇద్దరు పోద‌రులు కలిసి వేదికను పంచుక‌వ‌డ‌మేకాక‌.. కౌగిలించుకున్నారు. ముంబయిలోని వర్లీలో మరాఠీ విజయ్ దివస్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ సోదరులిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. అయితే, ఇద్ద‌రి క‌ల‌యిక‌ మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పుకు సంకేతంగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. ఈ సమావేశానికి రాజ్ ఠాక్రే తన సతీమణి షర్మిల, కుమారుడు అమిత్ ఠాక్రే, కుమార్తె ఊర్వశితో కలిసి వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా తన కుటుంబంతో వచ్చారు. ఆయ‌న వెంట భార్య రష్మీ, కుమారులు ఆదిత్య, తేజస్ ఉన్నారు.

జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా చీఫ్ రాజ్ ఠాక్రే ఆందోనళనకు పిలుపునిచ్చారు. 2025, జూలై 5న ముంబైలోని వర్లీలో సంయుక్తంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ క్ర‌మంలో రెండు దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి ఈ ర్యాలీలో ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలిసి పాల్గొన్నారు. థాక్రే సోదరులు కలవడంతో బాల్ థాక్రే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ఈ సందర్భంగా రాజ్ థాకరే మాట్లాడుతూ.. "రాజకీయాలు, పోరాటం కంటే నా మహారాష్ట్ర పెద్దదని నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఈరోజు 20 ఏళ్ల తర్వాత నేను, ఉద్ధవ్‌ కలిసి వచ్చాం, బాలాసాహెబ్ చేయలేని పని దేవేంద్ర ఫడ్నవీస్‌ చేశారు. మంత్రి దాదా భూసే నా వద్దకు వచ్చి, తన మాట వినమని నన్ను అభ్యర్థించారు, నేను మీ మాట వింటాను కానీ అంగీకరించను అని చెప్పాను. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లకు మూడవ భాష ఏది అని నేను అడిగాను. హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నీ మన వెనుక ఉన్నాయి. అన్ని హిందీ మాట్లాడే రాష్ట్రాల కంటే మేము ముందున్నాము. అయినప్పటికీ మనం హిందీ నేర్చుకోవలసిందిగా బలవంతం చేయబడుతున్నాము. ఎందుకు?" "నాకు హిందీపై ఫిర్యాదు లేదు, ఏ భాష చెడ్డది కాదు. భాషను రూపొందించడానికి చాలా కష్టపడాలి. మేము మరాఠా సామ్రాజ్యంలో అనేక రాష్ట్రాలను పాలించాము, కాని మేము ఆ ప్రాంతాలపై మరాఠీని ఎన్నడూ రుద్ధ‌లేదు. వారు హిందీని మనపై రుద్దే ప్రయోగాన్ని ప్రారంభించారు. మేము దానిని వ్యతిరేకించకపోతే.. వారు ముంబైని మహారాష్ట్ర నుండి వేరు చేస్తామ‌ని పరీక్షించడానికి ప్రయత్నించారు. "మా పిల్లలు ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివారని అంటున్నారు. దాదా భూసే మరాఠీ స్కూల్లో చదివి మంత్రి అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. నేను మరాఠీ పాఠశాలలో చదివానని, కానీ మా నాన్న శ్రీకాంత్ ఠాక్రే, మామయ్య బాలాసాహెబ్ ఠాక్రే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివారని నేను మీకు చెప్తాను. అయితే ఏంటీ.. మరాఠీపై అతని ప్రేమను ఎవరైనా ప్రశ్నించగలరా? రేపు నేను హిబ్రూ కూడా నేర్చుకుంటాను. నా మరాఠీ గర్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారా? అని ప్ర‌శ్నించారు.

శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. “మేము కలిసి జీవించడానికి కలిసి వచ్చామన్నారు. ఇప్పటికే మీరు మమ్మల్ని చాలా ఉపయోగించుకున్నారు, మీకు బాలాసాహెబ్ ఠాక్రే మద్దతు లేకపోతే.. మహారాష్ట్రలో మీకు ఎవరు తెలుసు. హిందుత్వం గురించి మాకు నేర్పడానికి మీరు ఎవరు? ముంబైలో అల్లర్లు జరిగినప్పుడు, మహారాష్ట్రలోని ప్రతి హిందువును మేము రక్షించామన్నారు.

Next Story