పూంచ్‌లో ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్ దాడి

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.

By Medi Samrat  Published on  4 Dec 2024 2:34 PM IST
పూంచ్‌లో ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్ దాడి

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదులు రెండు గ్రెనేడ్లను విసిరారు, వాటిలో ఒకటి మాత్రమే పేలింది. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి.

సూరంకోట్ ప్రాంతంలోని ఆర్మీ పోస్ట్ వెనుక ఉన్న ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్‌లలో ఒక సేఫ్టీ పిన్‌ సైనిక శిబిరం చుట్టు పక్కల గోడకు సమీపంలో లభ్యమైంది. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి.

Next Story