రాధికా యాదవ్‌కు అకాడమీ లేదు.. విచారణలో వెలుగులోకి కొత్త విషయం
టెన్నీస్ క్రీడాకారిణి రాధిక హత్య తర్వాత పోలీసుల విచారణ సాగుతోంది. విచారణలో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
By Medi Samrat
టెన్నీస్ క్రీడాకారిణి రాధిక హత్య తర్వాత పోలీసుల విచారణ సాగుతోంది. విచారణలో కొత్త సమాచారం బయటకు వస్తోంది. రాధికకు అకాడమీ లేదని, సెక్టార్ 56లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కోర్టును అద్దెకు తీసుకుని పిల్లలకు టెన్నిస్ నేర్పించేదని తెలిసింది. ఇదిలావుండగా.. నిందితుడు తండ్రి దీపక్ యాదవ్‌ను మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఇక్కడి నుంచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
హత్యానంతరం గురుగ్రామ్ పోలీసులు.. రాధికపై మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. అయితే.. శుక్రవారం మధ్యాహ్నం రాధిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, మృతదేహం నుంచి నాలుగు బుల్లెట్లు బయటపడ్డాయి. ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ రాధిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. మృతదేహంపై నాలుగు బుల్లెట్ గుర్తులు ఉన్నాయని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు తెలిపారు. బుల్లెట్లన్నీ లోపల ఇరుక్కుపోయాయి. వెనుక నుంచి మూడు బుల్లెట్లు, పక్క నుంచి ఒక బుల్లెట్ దూసుకుపోయిందని వెల్లడించారు.
హత్య జరిగిన రెండో రోజు కూడా రాధిక, సంగీత విద్వాంసుడు ఇనామూల్‌ల మ్యూజిక్ వీడియో ఇంటర్నెట్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఏడాది నాటి ఈ వీడియోలో ప్రేమ సన్నివేశాలున్నాయి. ఈ మ్యూజిక్ వీడియోకి హత్యను కూడా లింక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని మీడియా ఛానళ్లు రాధికతో వీడియోలో కనిపించిన ఆర్టిస్ట్‌తో మాట్లాడాయి. అతని పేరు ఇనాముల్. రాధికతో తనకు పెద్దగా పరిచయం లేదని విచారణలో చెప్పాడు.
సెక్టార్ 57లో జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె సొంత తండ్రి కాల్చి చంపారు. ఈ ఘటనతో నగర ప్రజలు షాక్‌కు గురయ్యారు. సమాజం వెక్కిరించడం వల్లే తండ్రి నిజంగానే కూతురి ప్రాణం తీశాడా లేక మరేదైనా కారణమా అనే ప్రశ్న ఒక్కటే జనం మదిలో మెదులుతోంది.