బీహార్‌లో తెలంగాణ జవాను ఆత్మహత్య.. గన్‌తో కాల్చుకుని..

Telangana jawan commits suicide in Bihar. బీహార్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శశస్త్ర సీమాబల్‌లో పని చేస్తున్న తెలంగాణకు చెందిన జవాను ఆత్మహత్యకు

By అంజి  Published on  19 Aug 2022 12:20 PM IST
బీహార్‌లో తెలంగాణ జవాను ఆత్మహత్య.. గన్‌తో కాల్చుకుని..

బీహార్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శశస్త్ర సీమాబల్‌లో పని చేస్తున్న తెలంగాణకు చెందిన జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌ చేసుకున్న జవాన్‌ను చీమల విష్ణుగా గుర్తించారు. ఎస్ఎస్బీ 45 బెటాలియ‌న్‌కు చెందిన అత‌ను సుపాల్‌ జిల్లాలోని వీర్‌పూర్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏమైందో.. ఏమో తెలియదు కానీ.. శుక్రవారం నాడు తన దగ్గరున్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే జవాన్ ఎందుకు ఇలా చేశాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story