'ఆ నియోజకవర్గాలకు నిధులు ఎందుకు ఇవ్వట్లేదు'.. సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన బండి సంజయ్

బిజెపి) ఎమ్మెల్యేలు గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

By అంజి  Published on  30 Jun 2024 9:33 AM GMT
Telangana govt, funds, BJP MLAs, constituencies, Bandi Sanjay

'ఆ నియోజకవర్గాలకు నిధులు ఎందుకు ఇవ్వట్లేదు'.. సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన బండి సంజయ్

హైదరాబాద్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి (MoS) బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

''గత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా వ్యవహరిస్తోంది. వివక్షాపూరిత చర్యలకు పాల్పడుతోంది. తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇదే విధంగా ఆలోచిస్తే ఇక్కడ అభివృద్ధి జరగదు, కాంగ్రెస్‌ ఎంపీలకు నిధులు ఇవ్వకుంటే మీరేం చేస్తారు? అని జూన్ 30 ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు.

మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్)పై తిరుగుబాటు చేసినట్లే, కాంగ్రెస్‌పై కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) 8 సీట్లు గెలుచుకుంది. బిజెపి గెలిచిన అభ్యర్థులు, వారి నియోజకవర్గాలు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (సిర్పూర్), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), ఆలేటి మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), రామారావు పటేల్ (ముధోలే), పైడి రాకేష్ రెడ్డి (ఆర్మూర్), కె వెంకట రమణా రెడ్డి (కామారెడ్డి), ధనపాల్ సూర్యనార్య గుప్తా (నిజామాబాద్ అర్బన్), మరియు టి రాజా సింగ్ (గోషామహల్). వరుసగా 64, 39 సీట్లు గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ (INC), భారత రాష్ట్ర సమితి (BRS) లతో పోలిస్తే బీజేపీ పనితీరు చాలా తక్కువగా ఉంది.

Next Story