మహారాష్ట్రలో పాగా వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ పై శివసేన (ఉద్ధవ్ థాకరే) నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఓడిపోతాననే భయం కేసీఆర్ కు పట్టుకుందని, అందుకే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారని అన్నారు. కేసీఆర్ డ్రామాలు ఆపాలని, లేకపోతే తెలంగాణలో ఓడిపోవడం ఖాయమని అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 12 నుంచి 13 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని.. మహారాష్ట్రలో మహాకూటమి బలంగా ఉందని అన్నారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు అని, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) బలంగా ఉందన్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మహారాష్ట్రలో ప్రతీకారం తీర్చుకుందామని భావిస్తే.. కేసీఆర్ బీజేపీకి పని చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. కేసీఆర్ బీజేపీ ‘బీ టీం’ అని బీజేపీనే కేసీఆర్‌ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందని అన్నారు.