ఏకంగా ఎన్.ఐ.ఏ. అధికారులపైనే దాడులకు దిగిన ఆ గ్రామస్థులు

2022 బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం విచారణ కోసం వెళ్లగా పశ్చిమ బెంగాల్ లోని గ్రామస్థులు ఏకంగా దాడులకు తెగబడ్డారు

By Medi Samrat  Published on  6 April 2024 8:00 PM IST
ఏకంగా ఎన్.ఐ.ఏ. అధికారులపైనే దాడులకు దిగిన ఆ గ్రామస్థులు

2022 బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం విచారణ కోసం వెళ్లగా పశ్చిమ బెంగాల్ లోని గ్రామస్థులు ఏకంగా దాడులకు తెగబడ్డారు. శనివారం బెంగాల్‌లోని తూర్పు మెదినీపూర్ జిల్లాలో ఈ దాడి చేసింది. భూపితానినగర్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అధికారి గాయపడ్డారు. ఒక గుంపు అకస్మాత్తుగా బృందంపై దాడి చేసి ఎన్.ఐ.ఏ. బృందానికి చెందిన కారును ధ్వంసం చేసింది. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. పురుషులు, మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం.. పోలీసులపై అరుస్తూ, వారిని వెనక్కి వెళ్లమని బెదిరించడం ఒక వీడియోలో చూడొచ్చు. మహిళలు కర్రలతో అధికారులు వెళ్లకుండా వీధిలో కూర్చున్నారు.

బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానాతో సహా ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారుల బృందం అరెస్టు చేసింది. కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఏజెన్సీ బృందంపై దాడి జరిగింది. మోనోబ్రోటో జానా, అతని కుటుంబ సభ్యులు, ఇతర గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందే సమాచారం అందించామని, సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని NIA అధికారులు తెలిపారు. NIA బృందం ఉదయం 5.30 గంటలకు భూపితానినగర్‌కు వెళ్లింది. ఊహించని విధంగా గ్రామస్థుల నుండి ప్రతిఘటన ఎదురైందని బెంగాల్ పోలీసులు అంటున్నారు.

Next Story