మధ్యప్రదేశ్‌లో 22 మంది మరణాలకు కారణమైన కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తయారు చేస్తున్న 'శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ' తయారీ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం ప్రకటించింది. దగ్గు సిరప్‌లో విషపూరిత కలుషితాలు, ముఖ్యంగా డైథిలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు గుర్తించిన తర్వాత కంపెనీని అధికారికంగా మూసివేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తమిళనాడులోని అన్ని ఔషధ తయారీ యూనిట్లలో ప్రస్తుతం సమగ్ర తనిఖీలు జరుగుతున్నాయి.
అక్టోబర్ 9న చెన్నైలో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్‌ను పరాసియా కోర్టు 10 రోజుల పోలీసు కస్టడీకి పంపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు సీనియర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను కూడా సస్పెండ్ చేశారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు-1945 ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది, ఆమోదం పొందే ముందు ముడి పదార్థాలు, పలు ఔషధ పరమైన పరీక్షలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.